sridevi: శ్రీదేవి జీవితకథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోందని ఆరోపిస్తూ.. ప్రియా ప్రకాశ్‌కు బోనీ నోటీసులు

  • ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రంలో నటిస్తున్న ప్రియ
  • ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం
  • ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు నోటీసులు పంపించారు. ఆమె నటిస్తున్న చిత్రం తన భార్య శ్రీదేవి జీవితకథకు సంబంధించినదేనంటూ బోనీ ఆరోపిస్తున్నారు. అయితే ఆ చిత్ర దర్శకుడు మాత్రం తన సినిమా శ్రీదేవి జీవితకథకు సంబంధించింది కాదని పేర్కొంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. ప్రియా ప్రస్తుతం ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో ‘శ్రీదేవి బంగ్లా’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి మరణించడం సహా పలు విషయాలను ఇందులో చూపించారు. ట్రైలర్, టైటిల్ పరంగా చూస్తే ఈ చిత్రం శ్రీదేవి జీవితకథకు సంబంధించిందేననే సందేహం కలుగుతోంది. దీంతో బోనీ.. ప్రియాతో పాటు చిత్రబృందానికీ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన ప్రశాంత్.. తమది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని.. శ్రీదేవి పేరు సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునేదేనని బోనీకి చెప్పినట్టు తెలిపారు. ఈ కేసును తాము ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

sridevi
Bony kapoor
Priya Prakash varrior
Prashanth Mambulli
Sridevi Banglow
  • Loading...

More Telugu News