Andhra Pradesh: షర్మిళపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. కారకులపై చర్యలకు మాజీ మంత్రి దాడి డిమాండ్!

  • షర్మిళను ఓ హీరోకు ముడిపెడుతూ వదంతులు
  • హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిళ
  • సుమోటాగా విచారణ చేపట్టాలని పోలీసులకు దాడి విజ్ఞప్తి

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై షర్మిళ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు స్పందించారు. షర్మిళపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని సుమోటాగా విచారణకు స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు.

నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరభద్రరావు కోరారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు సత్వరం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Andhra Pradesh
Sharmila
ys jagan
Social Media
prabhas
Telangana
Telugudesam
YSRCP
dadi
veera bhadrarao
Police
  • Loading...

More Telugu News