Australia: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఐదు కీలక వికెట్లు కూల్చేసిన భారత్!

  • 38 ఓవర్లకు 189 పరుగులు చేసిన ఆసిస్
  • ఒంటరి పోరాటం చేస్తున్న షాన్ మార్ష్
  • రెండో వన్డేపై పట్టుబిగుస్తున్న భారత్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డే మ్యాచ్ లో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు అడిలైడ్ లో జరుగుతున్న రెండో వన్డేలో పట్టు బిగుస్తోంది. కడపటి వార్తలు అందేసరికి 38 ఓవర్లకు ఆస్ట్రేలియా 189 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, జడేజా, షమీ చెరో వికెట్ పడగొట్టగా, భారత ఆటగాళ్ల చురుకైన సమన్వయంతో ఖవాజా, హ్యాండ్స్ కోంబ్ రనౌట్ గా వెనుదిరిగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున షాన్ మార్ష్(86), గ్లెన్ మాక్స్ వెల్(0) క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత జట్టుకు సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంటాయి.

Australia
India
Cricket
2nd oneday
adilied
  • Loading...

More Telugu News