Australia: అడిలైడ్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

  • సిడ్నీ వన్డేలో ఓడిన భారత్
  • ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ గల్లంతు
  • విజయం కోసం ఇరు జట్లు పోటాపోటీ

అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్ అదే వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు, ఈ వన్డేలో గెలిచి ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కోహ్లీ సేన గట్టి పట్టుదలగా ఉంది. టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఖలీల్ అహ్మద్ స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోబోమని, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడుతూ.. వికెట్ బాగుందని పేర్కొన్నాడు. మంచి స్కోరు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుతామన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే సిరీస్ కోల్పోయినట్టే. అడిలైట్ వన్డేలో గెలవడం ద్వారా సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని ఫించ్ సేన భావిస్తోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్స్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడెల్, రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్

  • Loading...

More Telugu News