Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్బింగ్ లో రాయ్ లక్ష్మి 'వెంకటలక్ష్మి' 
  • సుబ్బరాజుకి రజనీ మరో ఆఫర్ 
  • మహేశ్ 'మహర్షి' విడుదల వాయిదా?  

*  రాయ్ లక్ష్మి కథానాయికగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
*  రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తాజాగా వచ్చిన 'పేట' చిత్రం తమిళనాట హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో దర్శకుడు సుబ్బరాజుకి రజనీ మరో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడట. మరో కొత్త తరహా కథను తనకోసం తయారుచేయమని చెప్పాడని సమాచారం.
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఆమధ్య నిర్మాతలు ప్రకటించారు. అయితే, ఇప్పుడు దీనిని ఏప్రిల్ 26కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. విడుదల వాయిదాకు కారణం తెలియాల్సివుంది. 

Rai Lakshmi
Rajanikanth
Mahesh Babu
Surya
  • Loading...

More Telugu News