shabarimala: కాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. వేచి చూస్తున్న లక్షలాది భక్తులు!

  • పంపా నది, సన్నిధానం, హిల్ టాప్.. వద్ద ఏర్పాట్లు
  • అన్ని ఏర్పాట్లు చేసిన ట్రావెన్ కోర్ దేవస్థానం
  • సాయంత్రంతో ముగియనున్న తిరువాభరణ ఘట్టం  

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కాసేపట్లో మకరజ్యోతి దర్శనం జరగనుంది. ఈ దర్శనం కోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వేచిచూస్తున్నారు. మకరజ్యోతి దర్శనం నిమిత్తం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం పంపా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు.

అయ్యప్పస్వామి వారి తిరువాభరణాలను ఈరోజు సాయంత్రం 6 గంటలకు సన్నిధానానికి తరలించనున్నారు. 6.30 గంటలకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తవుతుంది. అనంతరం, పొన్నంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శన మివ్వనున్నారు. ఈ నెల 19 వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించనున్నారు. ఈ నెల 20న పందళ రాజవంశీకులు స్వామి వారి దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని మూసివేస్తారు.

shabarimala
makara jyothy
travencore devastanam
  • Loading...

More Telugu News