ka paul: అదే జరిగితే.. పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారు: కేఏ పాల్

  • టీడీపీ, వైసీపీలకు చెరో 10 సీట్లు కూడా రావు
  • మాకు 100 సీట్లు వస్తాయి
  • జనసేన సింగిల్ గా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు అవినీతిపరులని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు చెరో 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తమ పార్టీకి 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా గెలవదని... చివరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారని అన్నారు. పవన్ ఓడిపోకూడదని తాను కోరుకుంటున్నానని... అందుకే ఆయన తమతో కలిసిరావాలని చెప్పారు. జనసేన తమతో కలిస్తే సీట్ల సర్దుబాటు చేసుకుంటామని అన్నారు. 

ka paul
pawan kalyan
nanasena
prajasanthi party
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News