TRAI: హమ్మయ్య... ట్రాయ్ నిర్ణయంతో టీవీ ప్రేక్షకులకు భారీ ఊరట... 100 పే చానాళ్లు లేదా ఉచిత చానళ్లకు రూ. 153 మాత్రమే!

  • కేబుల్ అయినా, డీటీహెచ్ అయినా ఒకటే
  • నెలాఖరులోగా ఏ చానల్స్ కావాలో చెప్పండి
  • ప్రేక్షకులను కోరిన ట్రాయ్

టీవీ ప్రేక్షకులకు భారీ ఊరటను కలిగించే నిర్ణయాన్ని సంక్రాంతి సందర్భంగా ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ) ప్రకటించింది. 100 ఉచిత చానళ్లు లేదా ప్రేక్షకులు కోరుకునే 100 పే చానళ్లకు రూ. 153.40 మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. కేబుల్ ద్వారా కనెక్షన్ ఉన్నా, లేక డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) అయినా, 100 చానళ్లను ఇదే ధరపై ప్రేక్షకులకు అందించాలని ట్రాయ్ కోరింది. ఈ నెలాఖరులోగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి, ప్రేక్షకులు తమకు కావాల్సిన చానళ్లను తెలియజేయాలని తెలిపింది. ఈ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే 011-23237922 (ఏకే భరద్వాజ్), 011-23220209 (అరవింద్ కుమార్) లను సంప్రదించాలని ట్రాయ్ తెలిపింది.

TRAI
TV
Cable
Pay Channels
Free Channels
  • Loading...

More Telugu News