shakeela: నా అభిమాన హీరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: షకీలా

  • కమలహాసన్ అంటే ఎంతో అభిమానం
  • ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధం
  • దురదృష్టవశాత్తు నాపై శృంగార తార అనే ముద్ర పడింది

రాజకీయరంగంలోకి వచ్చేందుకు సినీ నటి షకీలా ఆసక్తిని కనబరుస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తన అభిమాన నటుడు కమలహాసన్ ఆహ్వానిస్తే... ఆయన స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. దురదృష్టవశాత్తు తనపై శృంగార తార అనే ముద్ర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమలహాసన్ అంటే తనకు ఎంతో అభిమానమని... ఆయన చిత్రాలను తాను విడుదల రోజే చూసేదాన్నని తెలిపారు. కమల్ రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని చెప్పారు.  

shakeela
politics
Kamal Haasan
  • Loading...

More Telugu News