Rangarao: సినీ దర్శకుడు కె.రంగారావు మృతి!

  • పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన రంగారావు
  • అనారోగ్య కారణంతో మృతి
  • సంతాపం వెలిబుచ్చిన టాలీవుడ్ ప్రముఖులు

పలు తెలుగు చిత్రాలకు డైరెక్టర్ గా, తదనంతర కాలంలో కో-డైరెక్టర్ గా పని చేసిన కె.రంగారావు హైదరాబాద్ లో మరణించారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. అనారోగ్య కారణంతో ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వస్థలం సూర్యపేట జిల్లా మేడారం. 1957లో జన్మించిన ఆయన, దశాబ్దాలుగా టాలీవుడ్ లో పని చేస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్ గా టాలీవుడ్ లో ఆయనకు ఎంతో గౌరవం ఉంది.

మొదట్లో దర్శకుడిగా మారి ఇంద్రధనుస్సు, ఆఖరి క్షణం, నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, అలెగ్జాండర్, ఉద్యమం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించినా, అనుకున్న రీతిలో రాణించలేకపోయారు. తాజాగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకీ నాయక' సినిమాకు దర్శకత్వ శాఖలో సేవలందించారు. గతంలో దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలను నిర్వహించారు. రంగారావు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

Rangarao
Tollywood
Director
Died
  • Error fetching data: Network response was not ok

More Telugu News