Madhya Pradesh: ఆపరేషన్ థియేటర్ లో నర్సుకి డాక్టర్ గారి ముద్దు... వీడియో వైరల్!
- ఉజ్జయిని ప్రభుత్వాసుపత్రిలో ఘటన
- నర్సుతో రాసలీలలాడిన వైద్యుడు
- విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం
అతను ఒక ప్రభుత్వ వైద్యుడు. సివిల్ సర్జన్ కూడా. ఇప్పుడాయన చేసిన నిర్వాకం, వీడియోకు ఎక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఉద్యోగం పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో మహిళను చుంబిస్తున్న డాక్టర్ వీడియో బయటకు రావడంతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మరో వైద్యుడిని నియమించింది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ, అదే ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోందని సమాచారం. ఈ వీడియో తొలుత వాట్స్ యాప్ కు ఎక్కి, ఆపై యూట్యూబ్, ఫేస్ బుక్ తదితరాల్లోకి షేర్ అయింది.