Daggubati venkateswara rao: వైసీపీలోకి దగ్గుబాటి.. త్వరలోనే చేరిక.. పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే?

  • అతి త్వరలోనే వైసీపీ తీర్థం
  • కుమారుడు హితేశ్‌కు పర్చూరు టికెట్
  • వైసీపీ ఫ్లెక్సీలపై హితేశ్ ఫొటోలు

మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు త్వరలోనే వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చొరవతో ఆయన ఆ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, వెంకటేశ్వరరావు-పురందేశ్వరిల ఏకైక కుమారుడు హితేశ్ చెంచురామ్‌ వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హితేశ్ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు చెబుతున్నారు.

సంక్రాంత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై హితేశ్, వెంకటేశ్వరరావు ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.  భర్త, కుమారుడు వైసీపీలో చేరినా పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉంటారని చెబుతున్నారు. వైసీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై దగ్గుబాటిని మీడియా ప్రశ్నించినప్పుడు సమయం వచ్చినపుడు చెబుతానంటూ సమాధానం దాటవేశారు.

Daggubati venkateswara rao
purandeswari
Hitesh chenchu ram
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News