Kolkata: కాంగ్రెస్ కార్యకర్తలు థియేటర్‌ను ధ్వంసం చేయడంపై అనుపమ్ ఖేర్ విసుర్లు
- కోల్‌కతాలో ఐనాక్స్ థియేటర్‌పై దాడి
- ప్రేక్షకులను బయటకు పంపి తెర చింపివేత
- రాహుల్‌పై మండిపడిన అనుపమ్ ఖేర్
కోల్‌కతాతో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా పరిగణించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. థియేటర్‌పై దాడి చేసిన వారు భావప్రకటన స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేస్తున్న ట్వీట్లను చదివి ఉండకపోవచ్చని ఎద్దేవా చేశాడు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాలో అనుపమ్ ఖేర్.. మన్మోహన్ సింగ్ పాత్రను పోషించాడు. సినిమా విడుదలకు ముందు నుంచే వివాదం నెలకొంది. కాగా, కోల్‌కతాలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న ఐనాక్స్ థియేటర్‌లోకి ప్రవేశించిన కాంగ్రెస్ మద్దతుదారులు థియేటర్‌ను ధ్వంసం చేశారు. ప్రేక్షకులను బయటకు పంపి తెరను చింపివేశారు.