Coffee with Karan: గతంలో అనుష్కశర్మపై రణ్ వీర్ అశ్లీల వ్యాఖ్యలు.. ఆడుకుంటున్న నెటిజన్లు

  • 2011లో 'కాఫీ విత్ కరణ్'లో రణ్ వీర్
  • కరీనాను చూస్తుంటే చిన్న వయసులోనే మూడ్ వచ్చేదని వ్యాఖ్య
  • నాటి అసభ్యకర మాటలను గుర్తు చేస్తూ ట్రోలింగ్

గతంలో తాను చేసిన అశ్లీల వ్యాఖ్యలకు గాను బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతున్నాడు. గతంలో ఒళ్లు మరిచిపోయి రణ్ వీర్, అనుష్కను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2011లో హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఇదే కరణ్‌ జోహర్‌ షోలో పాల్గొన్న రణ్‌ వీర్‌ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో సోషల్‌ మీడియా ప్రభావం అంతగా లేకపోవడంతో బతికిపోయిన రణ్‌వీర్‌, ఇప్పుడు దొరికిపోయాడు.

కరీనా కపూర్ పూల్ ఈత కొట్టడం చూస్తుంటే, చిన్న వయసులోనే తనకు మూడ్‌ వచ్చేదని ఆనాడు రణ్ వీర్ అంతటితో ఆగలేదు. అనుష్కకు గిల్లించుకోవాలని ఉంటే గిల్లుతానంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇది 8 సంవత్సరాల నాటి వీడియోనే అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లు రణ్‌వీర్‌సింగ్‌పై మండిపడుతున్నారు. సెలబ్రిటీలు ఇలా మాట్లాడుతుంటే, నవ్వుతూ ఉన్న కరణ్‌ జోహార్ ను సైతం వదలడం లేదు.

Coffee with Karan
Ranveer Singh
Anushka Sharma
  • Loading...

More Telugu News