Sidney: సిడ్నీ వన్డే: 34 పరుగుల తేడాతో టీమిండియాపై ఆసీస్ విజయం

  • వన్డేను సొంతం చేసుకున్న ఆసీస్
  • నిలదొక్కుకునేందుకు శ్రమించిన భారత్
  • 254 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీసేన

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు సిడ్నీలో జరిగిన తొలి వన్డేను ఆసీస్ సొంతం చేసుకుంది. 34 పరుగుల తేడాతో టీమిండియాపై ఆసీస్ గెలుపు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 289 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.

దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి క్రీజులో నిలదొక్కుకోవడానికి శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ(133), ధోనీ(51) రాణించినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో 0-1 ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది.

Sidney
Australia
India
Rohith Sharma
Dhoni
  • Loading...

More Telugu News