amit shah: అమిత్ షా ఎక్కడ నిలబడినా ఆయనపై పోటీ చేస్తా: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

  • బీజేపీ తదుపరి లక్ష్యం పశ్చిమబెంగాల్ అని అమిత్ షా చెబుతున్నారు
  • 42 స్థానాల్లో ఆయన ఎక్కడైనా పోటీ చేయవచ్చు
  • మమతా బెనర్జీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు టీఎంసీ ఎంపీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. తన తదుపరి లక్ష్యం పశ్చిమబెంగాల్ అంటూ అమిత్ షా చెబుతున్నారని... రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్ సభ నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని... ఆయనపై తాను పోటీ చేసి ఓడిస్తానని ఛాలెంజ్ చేశారు. 2019 ఎన్నికల్లో మమతాబెనర్జీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గురువారం నాడు అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్ గా ఉన్నారని... ఆరోజు అమిత్ షా మీడియా సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు. 

amit shah
mamata banerjee
abhishek banerjee
bjp
tmc
  • Loading...

More Telugu News