Guntur District: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు.. భయభ్రాంతులకు లోనైన ప్రజలు

  • మధ్యాహ్నం 3:30 గంటలకు కంపించిన భూమి
  • 20 నిమిషాల తరువాత మరోసారి ప్రకంపనలు
  • ఇంటి నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు  కలకలం రేపాయి. 20 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. జిల్లాలోని పిడుగురాళ్లలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. మళ్లీ 20 నిమిషాల తర్వాత మరోసారి ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

Guntur District
Piduguralla
Earth Quake
  • Loading...

More Telugu News