Telangana: టీఆర్ఎస్ జెండా 33 దేశాల్లో ఎగురుతోంది.. త్వరలోనే ఎన్నారై పాలసీ తీసుకొస్తాం!: కల్వకుంట్ల కవిత

  • టీఆర్ఎస్ ఎన్నారై శాఖపై వెనక్కు తగ్గం
  • తెలంగాణ భవన్ లో యూకే సెల్ 8వ వార్షికోత్సవ వేడుకలు
  • ఎన్నారై పాలసీపై కేటీఆర్ పనిచేస్తున్నారన్న కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ జెండా ఇప్పటికే 33 దేశాల్లో ఎగురుతోందని ఆ పార్టీ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీఆర్ఎస్ ఎన్నారై శాఖను ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన ఎన్నారై టీఆర్ఎస్ యూకే సెల్ 8వ వార్షికోత్సవ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ఎన్నారై విధానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖతో కలిసి త్వరలోనే ఎన్నారై విధానాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, యూకే సెల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం తదితరులు పాల్గొన్నారు.

Telangana
TRS
33 countries
nri policy
uk cell 8th anniversary
K Kavitha
KTR
Telangana bhavan
  • Loading...

More Telugu News