Andhra Pradesh: సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. 18న ఆవిష్కరణ

  • నియోజకవర్గంలో సుందరీకరణ చర్యలు
  • ఏడు ఎకరాల్లో పార్క్ నిర్మాణం
  • పార్కులో జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సత్తెనపల్లి చెరువులో 36 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కోడెల తెలిపారు. అలాగే చెరువుకు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలంలో పార్కును నిర్మించామన్నారు.

ఇందుకోసం రూ.9 కోట్లు ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు. ఈ పార్కు చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కోడెల అన్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించామనీ, ఈ నెల 18న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పీకర్ తెలిపారు.

Andhra Pradesh
Guntur District
kodela
siva prasad
sattenapalli
park
  • Loading...

More Telugu News