Andhra Pradesh: రైతులు ఒప్పుకుంటే ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ పూలింగ్ చేపడతాం!: చంద్రబాబు కీలక ప్రకటన

  • ఇక్కడ అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవచ్చు
  • ఐకానిక్ వంతెన పనులకు సీఎం శంకుస్థాపన
  • సీఎం ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన రైతులు

కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతి రైతుల తరహాలో సహకరిస్తే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ల్యాండ్ పూలింగ్ కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుందామని వ్యాఖ్యానించారు. జిల్లాలో కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

కృష్ణా జిల్లా అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రైతులను స్ఫూర్తిగా తీసుకోవడానికి సిద్ధమేనా? అని సీఎం ప్రశ్నించగా, రైతుల నుంచి  పెద్దఎత్తున సానుకూల స్పందన వచ్చింది.

Andhra Pradesh
Krishna District
amaravati
ibrahimpatnam
Chandrababu
land pooling
Telugudesam
farmers
best town
  • Loading...

More Telugu News