hyderabad: హైదరాబాదులో కలకలం రేపుతున్న స్వైన్ ఫ్లూ
- చలి తీవ్రత పెరగడంతో వ్యాప్తి చెందుతున్న స్వైన్ ఫ్లూ
- 10 రోజుల్లో 83 మందికి సోకిన వ్యాధి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్యులు
హైదరాబాదులో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. చలి తీవ్రత పెరగడంతో ఇది వ్యాపిస్తోంది. గత 10 రోజుల్లో 83 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు పరీక్షల్లో తేలిందని వైద్యాధికారులు తెలిపారు. జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు 483 మంది రక్త నమూనాలను పరీక్షించగా... వారిలో 83 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి సగటున రోజుకు 500 మంది రోగులు వస్తుంటారని... కానీ, చలి తీవ్రత పెరగడంతో రోజుకు వెయ్యి మంది వస్తున్నారని తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.