Team India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. జట్టు నుంచి పాండ్యా, రాహుల్ ఔట్

  • ఒకే ఒక్క స్పిన్నర్‌తో ఆసీస్
  • రాయుడు, జడేజాకు చోటిచ్చిన భారత్
  • సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో తొలి మ్యాచ్

భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లకు తుది జట్టులో స్థానం కల్పించిన ఆసీస్.. ఒకే ఒక్క స్పిన్నర్ నాథన్ లియాన్‌తో బరిలోకి దిగుతోంది. వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆడం జంపాను పక్కనపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో నిషేధానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ స్థానాల్లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలకు భారత జట్టులో చోటు కల్పించారు.

భారత జట్టు: శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కె.ఖలీల్ అహ్మద్

ఆసీస్ జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్స్, పీటర్‌హ్యాండ్స్ కోంబ్, మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడెల్, రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్

Team India
Australia
Oneday cricket
Virat Kohli
Aaron Finch
  • Loading...

More Telugu News