cuddapah: కడపకు కృష్ణా జలాలు ఎక్కడొచ్చాయని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదం: సీఎం రమేశ్

  • రెండేళ్లలో పులివెందులకు 15 టీఎంసీల నీళ్లొచ్చాయి
  • ఉక్కు కర్మాగారం ఇవ్వని కేంద్రాన్ని జగన్ ఏమనరే?
  • కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు భయం?

కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని వైఎస్ జగన్ పై టీడీపీ నేత సీఎం రమేశ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కడప’ అంటే పౌరుషానికి పేరని, మరి, ఈ ప్రాంత వాసిగా ఉన్న జగన్, కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్పించారు.

కడప జిల్లాకు కృష్ణా జలాలు వస్తే ఆ జలాలు ఎక్కడొచ్చాయని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ రెండేళ్లలో పులివెందులకు దాదాపు 15 టీఎంసీల నీళ్లొచ్చాయని, ఈరోజున జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఉందని, ఆ ఘనత సీఎం చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు.

cuddapah
pulivendula
Telugudesam
CM Ramesh
Jagan
  • Loading...

More Telugu News