sensex: ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు

  • 96 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత

వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ... మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. మూడవ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటిస్తుండటమే దీనికి కారణం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 36,009కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 10,795 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఇన్ఫ్రాటెల్, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. హిందాల్కో, ఐఓసీ, ఓఎన్జీసీ, యూపీఎల్, ఐటీసీ తదితర కంపెనీలు లాభపడ్డాయి.

  • Loading...

More Telugu News