Andhra Pradesh: బొత్స భార్య కారు ఢీకొని గాయపడిన చిన్నారి మృతి!

  • మూడ్రోజుల క్రితం తామరాపల్లిలో ప్రమాదం
  • చిన్నారిని రిమ్స్ కు తరలించిన తల్లిదండ్రులు
  • జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లాలోని తామరాపల్లిలో ఇటీవల వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ రాణి కారు ఢీకొని రోహిత్ అనే బాలుడు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు రోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోహిత్ తల్లి రాజేశ్వరి గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తామరాపల్లి గ్రామం వద్ద బైపాస్ వంతెనను నిర్మించడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారి మృతికి నిరసనగా ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నుంచి హామీ వచ్చేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఈరోడ్డుపై పికెటింగ్ ఏర్పాటు చేశారు. జలుమూరు ఎస్‌ఐ గోవిందరావు, నరసన్నపేట ఎస్‌ఐ నారా యణ స్వామి ఆధ్వర్యంలో గ్రామంలో పహారా నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh
Srikakulam District
YSRCP
bosta
Road Accident
jhansi lakshmi
bostas wife
car accident
rohit
kid dead
Police
  • Loading...

More Telugu News