Andhra Pradesh: పార్టీ మారే ప్రసక్తే లేదు: మంత్రి అఖిల ప్రియ

  • ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను
  • కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • ఆళ్లగడ్డలో గెలిచి బాబుకు కానుకగా ఇస్తా

ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ పార్టీ మారతారంటూ వ్యాపించిన వదంతులపై ఆమె స్పందించారు. కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అన్నారు. చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయని అన్నారు. నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ధరకు ఐదు రెట్లు ఇవ్వాలని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.

Andhra Pradesh
Telugudesam
akhila priya
allagadda
  • Loading...

More Telugu News