Nara Lokesh: ప్రజల ఆతిథ్యం, అభిమానం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు అనిపిస్తోంది: లోకేష్

  • పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్
  • పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
  • పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన 

ఏపీ మంత్రి నారా లోకేష్ 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల ఆతిథ్యం, అభిమానం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు అనిపిస్తోందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు.

పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కట్టమూరు గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీ విలేజ్ తాగునీటి పథకాన్ని, రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే, పెద్దాపురంలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే వ్యవసాయాధికారి కార్యాలయం, కాపు కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులతో పాటు జలధార కార్యక్రమంలో భాగంగా కట్టమూరులో రూ.4.93 కోట్ల వ్యయంతో నిర్మించే ఇంటింటికి కుళాయి పథకానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.

  • Loading...

More Telugu News