kcr: కేసీఆర్ తో కలసి పనిచేస్తా.. చంద్రబాబును సలహాదారుడిగా పెట్టుకుంటా: కేఏ పాల్

  • మేము అధికారంలోకి రాబోతున్నామని పలు సర్వేలు చెప్పాయి
  • జగన్ ముఖ్యమంత్రి కాలేరు
  • ఎన్నికల్లో పవన్ ప్రభావం ఉండదు

ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సర్వేలు నిర్ధారించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండదని తెలిపారు.

మోదీ, చంద్రబాబులు శాశ్వత మిత్రులని కేఏ పాల్ చెప్పారు. వారిద్దరూ కలసి తన సంస్థకు నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మోదీ, చంద్రబాబులతో ఇప్పుడు జగన్ కలిశారని... వీరిలో ఎవరికి ఓటు వేసినా మోదీకి వేసినట్టేనని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని కావడం అసంభవమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలసి పని చేస్తానని చెప్పారు. తన సలహాదారుడిగా చంద్రబాబును పెట్టుకుంటానని వ్యాఖ్యానించారు. 

kcr
ka paul
Chandrababu
jagan
Pawan Kalyan
Telugudesam
TRS
YSRCP
janasena
modi
bjp
prajasanthi party
  • Loading...

More Telugu News