Amit Shah: చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్‌లకు బీజేపీ కొత్త పదవులు

  • ముగ్గురికీ జాతీయ ఉపాధ్యక్ష పదవులు
  • ఉత్తర్వులు జారీ చేసిన అమిత్ షా
  • ఇటీవల ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు బీజేపీ అధిష్ఠానం కొత్త పదవులు ఇచ్చింది. వీరు ముగ్గురినీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ గురువారం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వీరు ముగ్గురూ కీలక పాత్ర పోషించనున్నారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గతనెలలో చౌహాన్ మాట్లాడుతూ.. తనకు మధ్యప్రదేశ్‌లోనే బాగుందని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అంతలోనే ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Amit Shah
Shivraj Singh Chouhan
Vasundhara Raje
Raman Singh
BJP
  • Loading...

More Telugu News