Donghai Airlines: విమానం కాక్‌పిట్‌లోకి భార్య.. చైనీస్ పైలట్‌పై సస్పెన్షన్ వేటు, జరిమానా

  • భార్యను రెండుసార్లు కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లిన పైలట్
  • ప్రయాణం మొత్తం తన పక్కనే కూర్చోబెట్టుకున్న వైనం
  • క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంస్థ

నిబంధనలకు విరుద్ధంగా విమానం కాక్‌పిట్‌లోకి భార్యను తీసుకెళ్లిన చైనీస్ పైలట్‌‌పై ఆరు నెలల వేటు పడింది. షెంజెన్‌కు చెందిన డాంఘై ఎయిర్‌లైన్స్‌ కథనం ప్రకారం.. చెన్ అనే పైలట్ గతేడాది జూలై 28న తన భార్యను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ఇలా రెండుసార్లు తన భార్యను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడంపై విమానయాన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తొలిసారి నాన్‌టాంగ్ నుంచి లాంఝౌ వెళ్తున్న విమానంలో, రెండోసారి లాంఝౌ నుంచి బీజింగ్ వెళ్తున్న విమానంలోని కాక్‌పిట్లలోకి భార్యను తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. భార్యకు టికెట్ తీసుకున్న చెన్ ప్రయాణం మొత్తం భార్యను తనతోపాటు కూర్చోబెట్టుకున్నాడు.  

చెన్ చర్యలను తీవ్రంగా పరిగణించిన విమానయాన సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో మరెవరూ నిబంధనలు మీరకూడదనే ఉద్దేశంతో చెన్‌పై ఆరు నెలల నిషేధంతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించినట్టు డాంఘై ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

  • Loading...

More Telugu News