Car accident: మంగళగిరి హైవేపై అగ్నికి ఆహుతైన కారు.. పరుగులు తీసిన ప్రయాణికులు

  • కారు ఇంజిన్ నుంచి మంటలు
  • క్షణాల్లోనే బుగ్గి అయిన కారు
  • క్షేమంగా బయటపడిన ఐదుగురు

విజయవాడ వెళ్తున్న ఓ కారు గుంటూరు సమీపంలో అగ్నికి ఆహుతైంది. మంగళగిరి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. విజయవాడవైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, అందులోని నలుగురు ప్రయాణికులు కారును ఆపి కిందికి దిగి పరుగులు తీశారు. ఈ క్రమంలో డ్రైవర్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి.

 చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే కారంతా వ్యాపించి బుగ్గి చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో వంతెనపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Car accident
Vijayawada
mangalagiri
High way
Fire Accident
Andhra Pradesh
  • Loading...

More Telugu News