Go Air: ఇంజిన్ విఫలమై ఆకాశంలో ఊగిపోయిన విమానం.. ప్రయాణికులు సేఫ్!

  • ముంబై-ఢిల్లీ వెళ్తున్న గో ఎయిర్ విమానం
  • పెద్ద శబ్దంతో గాల్లో ఊగిన విమానం
  • బెంబేలెత్తిన ప్రయాణికులు

ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన గో ఎయిర్ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. గంట ప్రయాణం తర్వాత ఇంజిన్ విఫలమై పెద్ద శబ్దంతో గాల్లో ఊగిపోయింది. దీంతో విమానంలోని 168 మంది ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రమాదాన్ని శంకించిన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీ పంపించారు.

గతవారం ఇండిగో విమానంలోనూ ఇటువంటి సమస్యే తలెత్తింది. చెన్నై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానంలోని ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఇంజిన్ నుంచి పొగలు, శబ్దం వచ్చి ఊగిపోయింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. వారం వ్యవధిలోనే ఇటువంటి ఘటనలు రెండు జరగడం గమనార్హం.

Go Air
Mumbai
New Delhi
Aeroplane
Indigo
Engine fail
  • Loading...

More Telugu News