Peta: రజనీకాంత్ ‘పేట’కు భారీ ఓపెనింగ్స్

  • రూ.3.84 కోట్లు వసూలు
  • 220 లొకేషన్లలో విడుదల
  • ‘కబాలి’, ‘2.ఓ’తో పోలిస్తే చాలా తక్కువ

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ చిత్రం తొలి షోతోనే మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. రజనీ తన స్టైల్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు విదేశాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా 220 లొకేషన్స్‌లో విడుదల అయింది.

ఇప్పటి వరకూ అందిన కలెక్షన్ల వివరాల ప్రకారం ‘పేట’ ప్రీమియర్ షోల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో 5,45,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.84 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కలెక్షన్లు గతంలో రజనీ నటించిన ‘కబాలి’, ‘2.ఓ’ చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే చాలా తక్కువని సమాచారం.  

Peta
Rajinikanth
Karthik subbaraju
Currency
America
  • Loading...

More Telugu News