Arun Jaitly: వస్తు సేవల పన్ను పరిధి పెంపు.. చిన్న వ్యాపారులకు ఊరట!
- నేడు జీఎస్టీ మండలి 32వ సమావేశం
- చిరు వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట
- కాంపోజిషన్ పరిమితి పెంపు
జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో చిరు వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట లభించనుంది. నేడు జీఎస్టీ మండలి 32వ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులకు లాభం చేకూరే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
జీఎస్టీ మండలి సమావేశానంతరం జైట్లీ మాట్లాడుతూ.. కాంపోజిషన్ పరిమితిని రూ.కోటి నుంచి 1.5 కోట్లకు పెంచామని.. ఇది ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కాంపొజిషన్ పథకం కింద ప్రతి మూడు నెలలకొకసారి వ్యాపారులు పన్ను చెల్లించాలని.. అయితే రిటర్న్ మాత్రం ఏడాదికి ఒక్కసారే దాఖలు చేయాలని తెలిపారు.