YSRCP: తిరుమల కొండపైకి కాలినడకన బయలుదేరిన వైఎస్ జగన్

  • అలిపిరి నుంచి కొండపైకి వెళ్లనున్న జగన్
  • కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించిన అధినేత
  • జగన్ వెంట బయలుదేరిన నాయకులు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం అలిపిరి చేరుకున్నారు. అక్కడ నుంచి కాలినడకన బయలుదేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి తన నడకను జగన్ ప్రారంభించారు. జగన్ వెంట పార్టీ నాయకులు, భక్తులు తరలి వెళుతున్నారు. ఈరోజు సాయంత్రానికి కొండపైకి చేరుకున్న అనంతరం స్వామి వారిని జగన్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీస్సులు పొందనున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు జగన్ చేరుకుంటారు. 

YSRCP
ys jagan
Tirumala
Tirupati
alipiri
  • Loading...

More Telugu News