jd chakravarthi: పరభాషా చిత్రాలలో జేడీ చక్రవర్తి బిజీ!

  • ఒకప్పుడు హీరోగా మంచి క్రేజ్ 
  • ఆ తరువాత తగ్గిన అవకాశాలు
  • దర్శకుడిగానూ నిరాశే    

తెలుగులో హీరోగా విభిన్నమైన పాత్రలను చేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును జేడీ చక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆయనకి సక్సెస్ లు ఎలా వరుసగా వచ్చాయో .. పరాజయాలు కూడా అలాగే వరుసగా పలకరించాయి. దాంతో ఆయన దర్శకుడిగా కూడా మారి రెండు .. మూడు సినిమాలను తెరకెక్కించాడు. కానీ అవి కూడా ఆయనను నిరాశపరిచాయి. అలాంటి జేడీ చక్రవర్తి ప్రస్తుతం నటుడిగా ఇతర భాషల్లో బిజీగా ఉండటం విశేషం.

తమిళంలో ఆయన 'పట్టారై' అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. 'మరైందిరుందు పార్కుమ్ మర్మం ఎన్న' అనే మరో తమిళ సినిమాలోను ఒక విలక్షణమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక మలయాళంలో నివీన్ పౌలి మూవీ 'మైఖేల్'లో ఒక ప్రత్యేకమైన పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించనున్నాడు. కన్నడలోను ఆయన రెండు సినిమాలు చేస్తుండటం విశేషం.  మొత్తానికి ఇతర భాషా చిత్రాలతో జేడీ చక్రవర్తి బిజీగానే వున్నాడన్న మాట.

jd chakravarthi
  • Error fetching data: Network response was not ok

More Telugu News