Jammu And Kashmir: జమ్ము కశ్మీర్ లో ఈ ఉదయం స్వల్ప భూకంపం!

  • రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత
  • భయంతో వీధుల్లోకి ప్రజల పరుగులు
  • స్వల్ప ప్రకంపనలేనన్న అధికారులు

జమ్మూ కశ్మీర్‌లో ఈ ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్‌ స్కేలుపై భూప్రకంపనల 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. పలు భవనాల్లోని వస్తువులు కదిలాయని, కొన్ని చోట్ల పాత గోడలు కూలాయని తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా ఎటువంటి వివరాలూ వెల్లడికాలేదు. భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని, ఇది చాలా స్వల్పమైనదేనని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించింది. మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

Jammu And Kashmir
Earth Quake
Haryana
  • Loading...

More Telugu News