Roja: ఇచ్ఛాపురం రావాల్సింది.. జనాలు తొక్కేసేవారు!: మంత్రి సోమిరెడ్డికి రోజా కౌంటర్

  • ఇచ్చాపురం సభకు జన స్పందన లేదన్న సోమిరెడ్డి
  • తనదైన శైలిలో స్పందించిన రోజా
  • నేడు తిరుమలకు వచ్చిన రోజా

ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభకు జనాలే రాలేదని వ్యాఖ్యానించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో స్పందించారు. ఈ సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని వ్యాఖ్యానించిన ఆమె, సోమిరెడ్డి గనుక ఇచ్చాపురం సభకు వచ్చుంటే, జనాలు కాళ్లకింద వేసి తొక్కేసేవారని అన్నారు.

ఈ ఉదయం తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె, ఆపై మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, చంద్రబాబు పాలనను ఎండగడుతూ మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప యాత్ర సాగిందని చెప్పారు. జగన్ నేటి మధ్యాహ్నానికి తిరుమలకు చేరుకుంటారని, ఆపై రాత్రికి ఇక్కడే బస చేస్తారని చెప్పారు. జగన్ కు స్వాగతం పలికేందుకు వచ్చానని చెప్పారు. 

Roja
Jagan
Somireddy
Ichchapuram
  • Loading...

More Telugu News