Botsa Satyanarayana satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ కారు ఢీకొని బాలుడికి గాయాలు.. పరిస్థితి విషమం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-71a75921f27bbd2360b5bce02e241a923beab952.jpg)
- తీవ్రంగా గాయపడిన బాలుడు
- శ్రీకాకుళం జిల్లా తామరాపల్లిలో ఘటన
- రోడ్డుపై బైఠాయించి గ్రామస్థుల ఆందోళన
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి కారు ఢీకొని బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు రోహిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలుడిని వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం ఝాన్సీ వేరే కారులో వెళ్లిపోయారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.