janardhana Raju: తొమ్మిదో తరగతి విద్యార్థినికి టీచర్ అసభ్య మెసేజ్‌లు.. చితకబాదిన గ్రామస్థులు

  • సంవత్సర కాలంగా వేధింపులు
  • సెల్‌కు అసభ్య మెసేజ్‌లు
  • నో చెప్పినా వినని టీచర్

తొమ్మిదో తరగతి విద్యార్థినికి అసభ్యంగా మెసేజ్‌లు పెట్టిన 50 ఏళ్ల ఉపాధ్యాయుడు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బాలిక బంధువులు అతడిని చితకబాదారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం.. వీపీఆర్ కండ్రిక జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జనార్దనరాజు(50).. అదే పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సంవత్సర కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రులు కువైట్‌లో ఉండటంతో తమ కుమార్తెతో మాట్లాడేందుకు వారు సెల్‌ఫోన్ కొనిచ్చారు.

ఆ సెల్‌కు జనార్దనరాజు అసభ్య మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ‘ముద్దుగా ఉన్నావు.. ముద్దు కావాలి.. ఇస్తావా? ఎస్‌ ఆర్‌ నో చెప్పు’ అని వాట్సాప్‌ మెస్సేజ్‌ పెట్టాడు. బాలిక ‘నో సార్‌’ అని పెట్టడంతో ‘ఓకే మెసేజ్‌ డిలీట్‌ చేసెయ్‌..’ అని రిప్లయ్‌ పెట్టాడు. ఆ రోజు సాయంత్రం మళ్లీ ‘అడిగింది ఇవ్వవా.. నీకు ఏమి కావాలన్నా ఇస్తా.. ఐలైక్‌ ఇట్‌.. అందుకోరా బంగారు’ అంటూ ముద్దు సింబల్‌‌తో మెసేజ్‌ పెట్టాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పట్టించుకోని ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు నిలదీశారు.

 

janardhana Raju
Whatsapp
Messages
Kadapa
kuwait
Social Teacher
  • Loading...

More Telugu News