shivsena: బీజేపీని పాతిపెడతాం: శివసేన సీనియర్ నేత రాందాస్
- మెదీ హవా ఉన్నప్పుడే 288 స్థానాలకు గాను 63 గెలుచుకున్నాం
- మరాఠాలు, దంగర్లు, ముస్లింలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి
- వీరికి మరింత రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు?
తమతో పొత్తు పెట్టుకోకపోతే శివసేన పార్టీని అంతులేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా శివసేన సీనియర్ నేత రాందాస్ మాట్లాడుతూ, బీజేపీని పాతి పెడతామని అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవా తీవ్రంగా ఉన్నప్పటికీ... 288 అసెంబ్లీ స్థానాలకు గాను 63 స్థానాలను తాము గెలుచుకున్నామననే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ దారుణంగా ఓటమిపాలైందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రకు వచ్చి మమ్మల్ని హెచ్చరిస్తే... బీజేపీని పాతిపెడతామని హెచ్చరించారు.
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ల బిల్లు గురించి రాందాస్ మాట్లాడుతూ... ఇప్పటికే మరాఠాలు, దంగర్లు, ముస్లింలకు కోటా ఉందని... వీరికి మరింత రిజర్వేషన్ ను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? అని అడిగారు.