Telangana: చెరువు ఆక్రమణపై కేటీఆర్ ను ప్రశ్నించిన సామాన్యుడు.. వెంటనే స్పందించిన టీఆర్ఎస్ నేత!

  • మేడ్చల్ జిల్లా కీసరలో ఘటన
  • చెరువును ఆక్రమించిన ఓ వ్యక్తి
  • చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా సామాన్యులు తమ సమస్యలను ప్రస్తావిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉంటారు. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కీసర చెరువును కబ్జా చేస్తున్న విషయమై వెంకట్ బోగి అనే వ్యక్తి కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. ఎవరో ఓ వ్యక్తి ట్రక్కులతో చెరువులోకి మట్టి తోలిస్తూ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో వెంకట్ స్పందిస్తూ..  ‘అయ్యా, మా గోడు వినిపించదా మీకు? మేము ఏమి చేయం.. మీడియాలో, పేపరులో రాయిస్తాం అంతే.. అని అనుకోవాలా చెప్పండి. ఇవ్వాళ ఎవ్వడో వచ్చి  ప్రభుత్వం నాకు చెరువులో 2 ఎకరాలు ఇచ్చింది అంటూ పెద్ద పెద్ద లారీల్లో మట్టి తెచ్చి చెరువు పూడుస్తున్నాడు. దీనిపై స్పందించండి అని ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. చెరువు కబ్జాపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News