Andhra Pradesh: జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తి మీద ముద్దులు తప్ప ఇంకేమీ లేవు!: రఘువీరా సెటైర్లు

  • రోజుకు రూ.2 కోట్లు ఖర్చుపెడుతున్నారు
  • టీడీపీతో పొత్తుపై త్వరలోనే హైకమాండ్ నిర్ణయం
  • మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం పాదయాత్ర ముగిశాక జగన్ ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో జగన్, వైసీపీ వ్యవహారశైలిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రంగా స్పందించారు.

జగన్ ప్రజాసంకల్పయాత్రపై వైసీపీ గొప్పలు చెబుతోందని రఘువీరా విమర్శించారు. జగన్ పాదయాత్రలో రోజుకు రూ.2 కోట్ల ఖర్చు తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకోవడంపై త్వరగా తేల్చాలని పార్టీ హైకమాండ్ ను కోరామని రఘువీరా వెల్లడించారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఓ మిథ్య అని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తిమీద ముద్దులు తప్ప ఏమీ లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Prajasankalpayatra
Srikakulam District
Congress
raghuveera reddy
Telugudesam
Chandrababu
alliance
  • Loading...

More Telugu News