Jagan: ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం... 3648 కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించిన జగన్... పాదయాత్ర హైలైట్స్!

  • సుదీర్ఘ దూరాన్ని నడిచిన రాజకీయ నేతగా రికార్డు
  • 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో నడక
  • 231 మండలాలు, 2,516 గ్రామాలను చుట్టేసిన జగన్

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారి సమస్యలను తాను తీరుస్తానన్న భరోసాను కల్పించే దిశగా 2017, నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర, నేడు ముగియనుంది. సుదీర్ఘకాలం పాటు సుదీర్ఘ దూరాన్ని నడిచిన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో జగన్ ఓ చరిత్రను సృష్టించారనే చెప్పాలి. జగన్ పాదయాత్ర హైలైట్స్ ఇవి...

* జగన్ మొత్తం నడిచిన దూరం 3,648 కిలోమీటర్లు
* ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ యాత్ర సాగింది.
* 341 రోజుల పాటు జగన్ నడిచారు. (కోర్టుకు హాజరైన దినాలు మినహా)* కడప జిల్లాలో 7 రోజుల యాత్ర - 93.8 కిలోమీటర్ల నడక - 5 బహిరంగ సభలు, 3 ఆత్మీయ సమ్మేళనాలు
* కర్నూలు జిల్లాలో 18 రోజుల యాత్ర - 263 కిలోమీటర్ల నడక - 8 బహిరంగ సభలు, 6 ఆత్మీయ సమ్మేళనాలు
* అనంతపురం జిల్లాలో 20 రోజుల యాత్ర - 279.4 కిలోమీటర్ల నడక - 10 బహిరంగ సభలు, 4 ఆత్మీయ సమ్మేళనాలు
* చిత్తూరు జిల్లాలో 23 రోజుల యాత్ర - 291.4 కిలోమీటర్ల నడక - 8 బహిరంగ సభలు, 9 ఆత్మీయ సమ్మేళనాలు
* నెల్లూరు జిల్లాలో 20 రోజుల యాత్ర - 266.5 కిలోమీటర్ల నడక - 9 బహిరంగ సభలు, 6 ఆత్మీయ సమ్మేళనాలు
* ప్రకాశం జిల్లాలో 21 రోజుల యాత్ర - 278.1 కిలోమీటర్ల నడక - 9 బహిరంగ సభలు, 2 ఆత్మీయ సమ్మేళనాలు
* గుంటూరు జిల్లాలో 26 రోజుల యాత్ర - 281 కిలోమీటర్ల నడక - 11 బహిరంగ సభలు, 3 ఆత్మీయ సమ్మేళనాలు
* కృష్ణా జిల్లాలో 24 రోజుల యాత్ర - 239 కిలోమీటర్ల నడక - 10 బహిరంగ సభలు, 5 ఆత్మీయ సమ్మేళనాలు
* పశ్చిమ గోదావరి జిల్లాలో 27 రోజుల యాత్ర - 316.9 కిలోమీటర్ల నడక - 11 బహిరంగ సభలు, 5 ఆత్మీయ సమ్మేళనాలు
* తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజుల యాత్ర - 412 కిలోమీటర్ల నడక - 15 బహిరంగ సభలు, 2 ఆత్మీయ సమ్మేళనాలు
* విశాఖపట్నం జిల్లాలో 32 రోజుల యాత్ర - 277.1 కిలోమీటర్ల నడక - 9 బహిరంగ సభలు, 2 ఆత్మీయ సమ్మేళనాలు
* విజయనగరం జిల్లాలో 36 రోజుల యాత్ర - 311.5 కిలోమీటర్ల నడక - 9 బహిరంగ సభలు, 2 ఆత్మీయ సమ్మేళనాలు
* శ్రీకాకుళం జిల్లాలో 37 రోజుల యాత్ర -338.3 కిలోమీటర్ల నడక - 10 బహిరంగ సభలు, 6 ఆత్మీయ సమ్మేళనాలు (చివరి రోజైన బుధవారం సహా)
* యాత్ర 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో సాగింది
* తన యాత్రలో 231 మండలాలు, 2,516 గ్రామాలను జగన్ చుట్టేశారు.
* 54 మునిసిపాలిటీలు, 8 కార్పొరేషన్లలో నడక సాగింది.
* మొత్తం 124 సభలు, సమావేశాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు సాగాయి.

Jagan
Padayatra
Ichchapuram
Idupulapaya
  • Loading...

More Telugu News