Cold: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న చలి!

  • మంగళవారం నుంచి చంపేస్తున్న చలి
  • హైదరాబాద్ లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత
  • ఆదిలాబాద్ లో అత్యల్పంగా 8 డిగ్రీలు

డిసెంబర్ చివరి వారం, ఆపై జనవరిలో రెండు, మూడు రోజుల తరువాత స్వల్పంగా తగ్గిన చలి మళ్లీ నిన్నటి నుంచి తన పంజాను విసురుతోంది. మంగళవారం నాడు ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, విశాఖపట్నంలో 13, తిరుమలలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సోమ, మంగళవారాల్లో రాత్రి భారీగా మంచు కురిసింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, ఆపై నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉండటమే చలి పెరగడానికి కారణమని, ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, మరికొన్ని రోజులు వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.

Cold
Winter
Hyderabad
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News