Jagan: చీకట్లో మిరుమిట్లు... ప్రజాసంకల్పయాత్ర పైలాన్ ఇదే!

  • నేటితో ముగియనున్న యాత్ర
  • ఇచ్చాపురంలో సుందర పైలాన్
  • భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

341 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ ప్రజా సంకల్పయాత్ర నేడు ముగియనుంది. ఇచ్ఛాపురం సమీపంలోని కొజ్జీరియా గ్రామం నుంచి జగన్‌ చివరి రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆపై ఉదయం 11 గంటల సమయానికి లొద్దపుట్టి వద్ద ఏర్పాటైన మధ్యాహ్న భోజన విరామం శిబిరానికి చేరుకునే ఆయన, ఒంటిగంటకు బయలుదేరుతారు. అక్కడి నుంచి నడుచుకుంటూ, ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ వద్దకు వెళతారు. ఆపై పాతబస్టాండు వరకూ నడుస్తారు. ఈ సందర్భంగా అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

కాగా, ప్రజాసంకల్ప యాత్ర భావి తరాలకు గుర్తుండిపోయేలా చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుందరమైన పైలాన్ ను నిర్మించారు. మంగళవారం సాయంత్రానికే పైలాన్ నిర్మాణం పనులు పూర్తికాగా, రాత్రి వేళ విద్యుద్దీప కాంతుల మధ్య ఇలా వెలుగులీనుతోంది.

Jagan
Yatra
Srikakulam District
Ichchapuram
  • Loading...

More Telugu News