Balakrishna: అభిమానులతో కలిసి సినిమా చూస్తున్న బాలకృష్ణ!

  • సుమారు 1100 థియేటర్లలో సినిమా విడుదల
  • కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ కు వచ్చిన ఫ్యాన్స్
  • సినిమా బాగుందంటున్న అభిమానులు

ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100 థియేటర్లలో ఈ ఉదయం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల కాగా, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మిన్నంటుతోంది. చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్, కూకట్‌ పల్లిలోని భ్రమరాంబ థియటర్ లో అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయనతో పాటు విద్యాబాలన్, కల్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ కూడా సినిమా చూసేందుకు వచ్చారు. పలువురు అభిమానులు బాలయ్య, కల్యాణ్ రామ్ లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని చూపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ, ఓవర్ సీస్ నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చిందని చెప్పారు.

Balakrishna
NTR
Brahmarambha
Vidyabalan
  • Loading...

More Telugu News