Andhra Pradesh: ఆత్మాభిమానం అనే పదాన్ని చంద్రబాబు తన డిక్షనరీ నుంచి ఎప్పుడో తీసేశారు!: సోము వీర్రాజు

  • ఏపీలో అవినీతి వెనుక లోకేశ్ హస్తం
  • ఎమ్మెల్యేల నుంచి నగదు తీసుకుంటున్నారు
  • టీడీపీ అధినేతపై మండిపడ్డ బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేత సోము వీర్రాజు ఈరోజు విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అవినీతి వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వీర్రాజు ఆరోపించారు. ప్రతీ టీడీపీ ఎమ్మెల్యే నుంచి లోకేశ్ కు డబ్బులు అందుతున్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మాభిమానం అనే పదాన్ని తన డిక్షనరీ నుంచి ఎప్పుడో తీసేశారని సోము వీర్రాజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టడం ఆత్మాభిమానమా? అని ప్రశ్నించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
somu veeraju
Nara Lokesh
  • Loading...

More Telugu News