ntr: జయసుధ, జయప్రద, శ్రీదేవి.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు?: పాట టీజర్ ను విడుదల చేసిన వర్మ

  • లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్న వర్మ
  • ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై కథ 
  • ఈరోజు సాయంత్రం 5 గంటలకు పాట విడుదల

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, వ్యక్తిగత జీవితంలో లక్ష్మీ పార్వతి పాత్రను ప్రధానంగా ఇందులో చూపుతామని వర్మ గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో రెండో పాట ‘ఎందుకు’ టీజర్ ను వర్మ విడుదల చేశారు.

‘జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?’ అంటూ సాగే పాట టీజర్ ను వర్మ ఈరోజు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి పాటను  విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.

ntr
lakshmies ntr
Tollywood
ram gopal varma
movie
teaser
song
  • Loading...

More Telugu News