oc resevations: అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు మంచిదే...కాకుంటే బీజేపీది రాజకీయ ఎత్తుగడ : మాయావతి
- ఇంతకు ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది
- రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటన
- ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి కూడా ఆలోచించాలని సూచన
అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లను కేటాయించే బిల్లును తీసుకురావడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఆమె సమర్థిస్తూనే ఎన్నికల వేళ దీనిని బీజేపీ రాజకీయ ఎత్తుగడగా విమర్శించారు.
నిజంగా అగ్రవర్ణాలపై అభిమానం ఉండి ఉంటే ఇంతకు ముందే ఈ ప్రతిపాదన చేయాల్సి ఉండేదని చెప్పారు. ఎన్నికల ముందు దీన్ని గిమ్మిక్కుగా తీసేయకుండా అమల్లోకి తెస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. మోదీ ప్రయోగించిన రిజర్వేషన్ల బ్రహ్మాస్త్రం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో మాయావతి స్పందిస్తూ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తూనే, ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని సూచించారు. రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అమలు చేయాలని కోరారు. జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే మంచిదన్నారు.